తెలంగాణ హైకోర్టు కు తొలి మహిళా జస్టిస్

తెలంగాణ హైకోర్టు కు తొలి మహిళా జస్టిస్

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి రాబోతున్నారు. జస్టిస్‌ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీదేవి బదిలీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కొలీజియం ఆమె దరఖాస్తును కేంద్రానికి సిఫార్సు చేసిం ది. ఆంధ్రపదేశ్‌ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ శ్రీదేవి 1986లో లా పూర్తి చేశారు. 2005లోఝాన్సీలో జిల్లా సెషన్స్‌‌‌‌ జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్‌ 23న అలహాబాద్‌ హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌‌‌‌ను మినహాయిస్తే 10 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు.