తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ శ్యాం కోశీ..కేంద్రం ఉత్తర్వులు

తెలంగాణ  హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ శ్యాం కోశీ..కేంద్రం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. శ్యాం కోశీ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం గురువారం నియామక ఉత్తర్వులిచ్చింది.  ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌‌‌‌‌‌‌‌పాల్ కోల్‌‌‌‌‌‌‌‌కతా హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాం కోశీకి ఈ బాధ్యతలు అప్పగించారు. 

జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటివరకు జస్టిస్ పి. శ్యాం కోశీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.