ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మందమర్రి/బెల్లంపల్లి, వెలుగు: బహుజన రాజ్యం వస్తే పేదలకు విద్య, వైద్యం, ఉపాధి లభిస్తుందని, అగ్రవర్ణ పాలకులు పేద వర్గాలను అణిచివేతకు గురిచేస్తున్నారని దళితశక్తి ప్రోగ్రాం(డీఎస్​పీ) వ్యవస్థాపకుడు  డాక్టర్​ విశారదన్​ మహారాజ్​ చెప్పారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో పాదయాత్ర చేపట్టారు. తెలంగాణలో బహుజన రాజ్యం నెలకొల్పేందుకు స్వరాజ్య పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. సమస్త పార్టీలన్నీ సబ్బండ కులాలకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి మొత్తం బొగ్గుబాయిలు తవ్విందని..బొంబాయిని, దుబాయిని, హైదరాబాద్ ను కట్టింది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని గుర్తు చేశారు. 10 శాతం లేని రెండు కులాల చేతిలో  రాష్ట్రం ఉందని,  90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు రాజ్యాధికారానికి రావాలని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు స్వరాజ్య పాదయాత్ర బెల్లంపల్లి మండలం సోమగూడెం, మందమర్రిలో కొనసాగింది. డీఎస్పీ జెండా దిమ్మె, పదివేల కి.మీ పాదయాత్ర శిలాఫలకాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి వంశి, జిల్లా కో కన్వీనర్ రామస్వామి, చంద్రశేఖర్, సింగరేణి మెడికల్​ సూపరింటెండెంట్​డాక్టర్​రాజారమేశ్, రాజకీయ పార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.

తెలంగాణలో ‘ఆప్’ను విస్తరిస్తాం

నిర్మల్,వెలుగు: తెలంగాణలో ఆమ్​ఆద్మీ పార్టీని పటిష్టం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు​ ఇందిరా శోభన్ చెప్పారు. ఆదివారం యూత్​ కాంగ్రెస్  జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ సయ్యద్​ హైదర్ ఆప్​లో చేరారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బైల్ బజార్ వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటుచేసి సభలో ఇందిరా శోభన్ ​మాట్లాడుతూ.. ఆమ్​ఆద్మీ పార్టీని జిల్లాల వారీగా విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. యువత, మహిళలు ఆప్​లో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ రాజకీయ కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు. కాంగ్రెస్,​ టీఆర్ఎస్​, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేందుకు రెడీ అవుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆప్ లోక్​సభ కన్వీనర్​ రాథోడ్​సుభాష్   పాల్గొన్నారు.

కేసు విత్​డ్రా చేసుకోవాలని వీడీసీ బెదిరింపులు

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు

నర్సాపూర్ (జి), వెలుగు: నర్సాపూర్ మండలం టెంబురినికి చెందిన పలువురిని వీడీసీ బాధ్యులు బెదిరిస్తున్నారు. బాధితులు, ఎస్సై పాకాల గీత కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రం ఆనంద్, కారగిరి సాయన్న, కొత్తూరు దత్తాత్రి, మారెడ్డి నర్సయ్య, కారగిరి గంగయ్య భూమల విషయమై గ్రామానికి చెందిన కొందరు ఇబ్బందులకు గురిచేశారు. దీంతో వారంతా  కోర్టు ను ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు పెండింగ్​లో ఉంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన రావుల నాగభూషణ్​, ఎస్ కే బాషీద్, కుంటాల గంగయ్య కేసు ఉపసహరించుకోవాలని ఇటీవల ఒత్తిడిచేశారు. పట్టించుకోకపోవడంతో వారు వీడీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆనంద్, సాయన్న, దత్తాత్రి, నర్సయ్య, గంగయ్యలను గ్రామం నుంచి బహిష్కరించి ఇబ్బందికి పెట్టారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గీత తెలిపారు.

టీఆర్ఎస్​ పాలనలోనే రైతు సంక్షేమ పథకాలు

నిర్మల్,వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్​ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్  రెడ్డి చెప్పారు. ఆదివారం నిర్మల్​ మార్కెట్​కమిటీ పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. మార్కెట్​కమిటీ చైర్మన్, పాలకవర్గంపై​గురుతర బాధ్యతలు ఉన్నాయన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. రైతుబంధు, రైతు బీమా దాఏశంలో ఎక్కడ కూడా అమలు కావడంలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేసేవారని తెలిపారు. ప్రభుత్వం ఆధునీక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్​ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్​సీఎస్ చైర్మన్​ధర్మాజీ గారి రాజేందర్, రైతు సమన్వయ జిల్లా చైర్మన్ నల్లా వెంకట రామ్​రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, వైస్ చైర్మన్​ రఘునందన్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో ‘ఆప్’ను విస్తరిస్తాం

నిర్మల్,వెలుగు: తెలంగాణలో ఆమ్​ఆద్మీ పార్టీని పటిష్టం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు​ ఇందిరా శోభన్ చెప్పారు. ఆదివారం యూత్​ కాంగ్రెస్  జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ సయ్యద్​ హైదర్ ఆప్​లో చేరారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మంచిర్యాల చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బైల్ బజార్ వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటుచేసి సభలో ఇందిరా శోభన్ ​మాట్లాడుతూ.. ఆమ్​ఆద్మీ పార్టీని జిల్లాల వారీగా విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. యువత, మహిళలు ఆప్​లో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ రాజకీయ కార్యకలాపాలు విస్తరిస్తామన్నారు. కాంగ్రెస్,​ టీఆర్ఎస్​, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేందుకు రెడీ అవుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆప్ లోక్​సభ కన్వీనర్​ రాథోడ్​సుభాష్   పాల్గొన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తే సహించం

నస్పూర్, వెలుగు: టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం ప్రెసిడెంట్​వెంకట్​రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల  మల్లయ్య, సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఆదివారం నస్​పూర్​ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. బీజేపీ లీడర్లు అసత్యాలు ప్రచారం చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి యత్నించడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అయితే తగిన విధంగా స్పందిస్తామన్నారు. సోమవారం పెద్దపల్లిలో జరిగే సీఎం సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో సంఘం లీడర్లు ఈసంపెల్లి ప్రభాకర్, సురేంద్ రెడ్డి, మంద మల్లారెడ్డి, డికొండ అన్నయ్య, ఏనుగు రవీందర్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్  పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ప్రారంభం

లోకేశ్వరం,వెలుగు: మండలంలోని బిలోలి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను  ఆదివారం ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, నిజామాబాద్​జడ్పీ చైర్మన్​దాదన్నగారి విఠల్​రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. గ్రామంలో రూ. మూడు లక్షలతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా నిజామాబాద్​జడ్పీ చైర్మన్​ తనవంతుగా రూ.40 వేలు అందించారన్నారు. గ్రామానికి ఇప్పటికే హనుమాన్​మందిరం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రామాలయంలో  ధ్యాన మందిర ఏర్పాటు చేయడం రూ. 16.50 లక్షలు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్​ మండల కన్వీనర్ శ్యాంసుందర్, పీఏసీసీఎస్ చైర్మన్​ రత్నాకర్​రావు, జడ్పీ చైర్మన్  లోలం శ్యాంసుందర్, సర్పంచ్​దమ్మక్కొల్ల రజిత, ఎంపీటీసీ విజయ, లీడర్లు నర్సింగ్​రావు, సాయారెడ్డి, ప్రశాంత్, భోజన్న, గంగయ్య  ఉన్నారు.