తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ పి.శ్యామ్ కోశీ బదిలీ

తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ పి.శ్యామ్ కోశీ బదిలీ
  • కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

న్యూఢిల్లీ, వెలుగు: చత్తీస్‌‌గఢ్‌‌ హైకోర్టు జడ్జి జస్టిస్ పి.శ్యామ్ కోశీని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జె.సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. 

తనను చత్తీస్‌‌గఢ్‌‌ హైకోర్టు నుంచి బదిలీ చేయాలని జస్టిస్ పి.శ్యామ్ కోశీ చేసిన విజ్ఞప్తి మేరకు తొలుత ఆయన్ను మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు మినహా మరే రాష్ట్ర హైకోర్టుకైనా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేయాలని జస్టిస్ శ్యామ్ కోశీ విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కొలీజియం.. తాజాగా తెలంగాణకు బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది.