
- అమిత్ షా కామెంట్లను ఖండించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి
న్యూఢిల్లీ: నక్సలిజాన్ని ప్రోత్సహించేలా తీర్పు లిచ్చారంటూ తనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఇండియా కూటమి తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చత్తీస్‌గఢ్ సల్వాజుడుం కేసులో(2011) ఇచ్చిన తీర్పు నక్సలిజానికి మద్దతివ్వడం కోసం కాదని.. అది కేవలం రాజ్యాంగ హక్కులను, పౌరుల భద్రతను కాపాడేందుకేనని శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
తాను నక్సలిజాన్ని ప్రోత్సహిం చే విధంగా తీర్పులు ఇచ్చినట్లు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆ తీర్పును అమిత్ షా చదవాలని కోరారు. లేకుంటే ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు చేసే నిరాధారమైన కామెంట్లు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు.