జస్టిన్ బీబర్ కు పక్షవాతం

జస్టిన్ బీబర్ కు పక్షవాతం

అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక అతడి మ్యూజిక్ కన్సర్ట్ అంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్. అయితే బీబర్ కు పక్షవాతం వచ్చింది. తాను రామ్ సే హంట్ సిండ్రోమ్ తో బాధపడుతున్నానని..దాని వల్ల తన ముఖంలో పక్షవాతం వచ్చినట్లు బీబర్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ముఖంపై కుడివైపు పక్షవాతం వచ్చిందని దానితో కుడికన్ను కన్పించడం లేదని చెప్పాడు. ఇక కుడివైపు తన నవ్వు కూడా కన్పించని ఆవేదన వ్యక్తం చేశాడు. చెవిలో ఉన్న  నాడికి వైరస్ సోకడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లు వివరించాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఇండియాలో  బీబర్ తన ప్రదర్శన ఇవ్వాల్సివుంది. అయితే ఇది ఉంటుందో లేదో స్పష్టతలేదు. ఇప్పటికే  ఈ వారం నిర్వహించాల్సిన బీబర్ షోలన్నీ రద్దుచేశారు.