అందుకే ముంబైలో ఉంటున్నాను.. విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక

అందుకే ముంబైలో ఉంటున్నాను.. విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక

ఈ మధ్య సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది స్టార్స్ డివోర్స్ తీసుకుంటున్నారు. విడాకుల విషయం అనేది ఇప్పుడు చాలా సాధారణమైన విషయంగా మారింది. తాజాగా మరి సౌత్ స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు సూర్య, జ్యోతిక. అవును తమిళ ఇండస్ట్రీలోనే క్యూట్ కపుల్ గా చెప్పుకొనే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు విని అభిమానులు సైతం షాకయ్యారు. అయితే.. ఈ వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తన్నా ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించలేదు. 

దీంతో చాలా మంది ఈ వార్తలు నిజమే అనుకున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించారు నటి జ్యోతిక. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు విడాకుల విషయంపై ప్రశ్న ఎదురైంది. దానికి బదులుగా జ్యోతిక మాట్లాడుతూ.. నాకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. కేవలం పిల్లల చదువు, తన తల్లిదండ్రుల ఆరోగ్యం కారణంగానే ముంబైకి మారాను. అంతేకాదు.. అదే టైంలో కొన్ని బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం కూడా ఒక కారణమయ్యింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా.. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. నా భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తి. పిల్లల చదువు పూర్తవగానే చెన్నైకి వెళ్ళయిపోతాము.. అంటూ విడాకుల రూమర్స్ కు పులిష్టాప్ పెట్టారు జ్యోతిక. దీంతో సూర్య, జ్యోతిక విడాకులపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.