సింగరేణి సీఎండీగా చార్జ్ తీసుకున్న జ్యోతి బుద్ధప్రకాశ్‌

సింగరేణి సీఎండీగా చార్జ్ తీసుకున్న జ్యోతి బుద్ధప్రకాశ్‌

హైదరాబాద్, వెలుగు : సింగరేణి చైర్మన్, ఎండీగా నియమితులైన డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లోని చైర్మన్‌ ఆఫీస్‌లో అధికారికంగా చార్జ్‌ తీసుకుంటూ ఫైల్‌పై సంతకం చేశారు. ఆయనకు సంస్థ డైరెక్టర్లు ఎల్‌వీ.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతం పొట్రు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి. వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్థకు సంబంధించిన విధివిధానాల గురించి సీఎండీకి వివరించారు.