ఆర్చరీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌2 ఫైనల్లో జ్యోతి -ప్రియాన్ష్​

ఆర్చరీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌2 ఫైనల్లో జ్యోతి -ప్రియాన్ష్​

యెచియాన్‌‌‌‌ : ఇండియా స్టార్‌‌‌‌ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ–ప్రియాన్ష్.. ఆర్చరీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ స్టేజ్‌‌2లో ఫైనల్‌‌ చేరుకున్నారు.  కాంపౌండ్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ రెండో ర్యాంకర్లు జ్యోతి–ప్రియాన్ష్ 158–157తో హన్‌‌‌‌ సియెంగ్‌‌‌‌యోన్‌‌‌‌–యాంగ్‌‌‌‌ జావోన్‌‌‌‌ (సౌత్‌‌‌‌ కొరియా)పై గెలిచారు. మొత్తం 16 బాణాలను సంధించిన ఇండియా ద్వయం రెండు పాయింట్లను మాత్రమే చేజార్చుకుంది.

శనివారం జరిగే గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో జ్యోతి–ప్రియాన్ష్​.. ఒలీవియా డీన్‌‌‌‌–సవావెర్‌‌‌‌ సులివాన్‌‌‌‌ (అమెరికా)తో తలపడతారు. రికర్వ్‌‌‌‌లో మాజీ వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ దీపికా కుమారి వరుసగా నాలుగు విజయాలు సాధించి సెమీస్‌‌‌‌లో అడుగుపెట్టింది. క్వాలిఫికేషన్‌‌‌‌లో నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలిచిన దీపిక క్వార్టర్ ఫైనల్లో 6–4తో ఎలిఫ్‌‌‌‌ బెరెరా గొకారి (టర్కీ)పై నెగ్గి సెమీస్ చేరింది.

భజన్‌‌‌‌ కౌర్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లోనే వెనుదిరగగా, అంకితా భాకట్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌ దాటలేకపోయింది. మెన్స్‌‌‌‌లో తరుణ్‌‌‌‌దీప్‌‌‌‌ రాయ్‌‌‌‌, మ్రినాల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో, ధీరజ్‌‌‌‌ బొమ్మదేవర, ప్రవీణ్‌‌‌‌ జాదవ్‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌లో వెనుదిరిగారు. రికర్వ్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌లో దీపికా–తరుణ్‌‌‌‌దీప్‌‌‌‌ రాయ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌ను అధిగమించలేకపోయారు.