10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ :జ్యోతిరాదిత్య సింధియా

10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ  :జ్యోతిరాదిత్య సింధియా

ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుపోతున్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. జనవరి 18వ తేదీ గురువారం బేగంపేట్ ఏయిర్ పోర్ట్ లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించే... వింగ్స్ ఇండియా 2024, గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు.

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని... అత్మనిర్బర్ భారత్ కార్యక్రమం పౌర విమానయాన రంగానికి ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు సింధియా.  గత ఏడాది 15.2కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని తెలిపారు.  2030 కల్లా 30కోట్ల మందిని విమానయనాన్నికి దగ్గర చెయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కొనుగోలు చేస్తోందని..  మన దగ్గర 57 ఫ్లయింగ్ ట్రెడ్ ఆర్గనైజేషన్ లు ఉన్నాయని తెలిపారు.

రాబోయే రోజుల్లో 10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇస్తామని సింధియా చెప్పారు. డ్రోన్లకు 80శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బోయింగ్, ఎయిర్ బస్ నుంచి ప్రపంచస్థాయి విమానాలను పలు సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు.  వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంతో ప్రపంచస్థాయిలో దేశ పౌరవిమానయాన ఘనత చాటి చెప్పొచ్చని ఆయన అన్నారు.