అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ

అక్టోబర్ 2న ప్రపంచ శాంతి సభ

హైదరాబాద్: అక్టోబర్ 2న జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సభను  నిర్వహిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మొత్తం 28 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. మంగళవారం ప్రజా శాంతి పార్టీ కార్యాలయంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి పాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడారు. ప్రపంచ శాంతి సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సభకు అనుమతి ఇవ్వడంలేదని పాల్ అన్నారు.  టీఆర్ఎస్ గూండాలను పంపి తమ సభను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

శాంతి సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దేవుడి ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కేఏ పాల్ కోరారు.