Ruturaj Gaikwad: వికెట్ కీపింగ్ నేర్చుకో.. లేకపోతే టీమిండియాలో చోటు కష్టం: గైక్వాడ్‌కు మాజీ క్రికెటర్ సలహా

Ruturaj Gaikwad: వికెట్ కీపింగ్ నేర్చుకో.. లేకపోతే టీమిండియాలో చోటు కష్టం: గైక్వాడ్‌కు మాజీ క్రికెటర్ సలహా

టీమిండియాలో బ్యాడ్ లక్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే గైక్వాడ్ అనే చెప్పుకొవాలి.  జనవరి 11 నుంచి న్యూజిలాండ్ జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు ఈ యంగ్ బ్యాటర్ కు చోటు దక్కలేదు. తాను ఆడిన చివరి సిరీస్ లో సెంచరీతో సత్తా చాటినా 15 మంది స్క్వాడ్ లో రుతురాజ్ చోటు దక్కించుకోలేకపోయాడు. బాగా ఆడినా జట్టులో ఎంపిక కాకపోతే ఆటగాడికి కాన్ఫిడెంట్ పోతుంది. ప్రస్తుతం రుతురాజ్ పరిస్థితి అలాగే ఉంది. గైక్వాడ్ కు అన్యాయం జరిగిందని చాలామంది మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గైక్వాడ్ టీమిండియాలో ఉండాలంటే ఒక సలహా ఇచ్చాడు.  

రుతురాజ్ గైక్వాడ్‌ను తొలగించడంపై భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ విచారం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ తో మాట్లాడుతూ టీమిండియా స్క్వాడ్ లో నితీష్ కుమార్ ను పక్కన పెట్టి గైక్వాడ్ కు చోటు ఇవ్వాలని సూచించాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.." బహుశా రుతురాజ్ గైక్వాడ్ తో ఆడినప్పుడు వికెట్ కీపింగ్ నేర్చుకొని ఉండాల్సింది. భారత జట్టులో గైక్వాడ్ ఎంపిక కావాలంటే వికెట్ కీపింగ్ ఒక్కటే ఆప్షన్. శ్రేయాస్ అయ్యర్ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. అయ్యర్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ 15 మందిలో ఉండాలి. నితీష్ కుమార్ రెడ్డిని తప్పించి గైక్వాడ్ ను స్క్వాడ్ లో తీసుకోవాల్సింది". అని శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

►ALSO READ | IPL 2026: హైదరాబాద్ బౌలింగ్ ఆశాకిరణం.. నెట్స్‌లో దినేశ్ కార్తీక్‌‌ను బెంబేలెత్తించిన SRH బౌలర్.. వీడియో వైరల్

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో గైక్వాడ్ ను ఎంపిక చేశారు. గైక్వాడ్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీతో దుమ్ములేపాడు. 2025, డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని జట్టుకు భారీ అందించాడు. గైక్వాడ్ వన్డే కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 34 ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

తొలి వన్డేలో 8 పరుగులే చేసి నిరాశపరిచిన గైక్వాడ్ రెండో వన్డేలో అద్భుతంగా రాణించాడు. మూడో వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  వైస్ కెప్టెన్ గా అయ్యర్ గాయం నుంచి కోలుకొని భారత జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో గైక్వాడ్ కు పక్కన పెట్టక తప్పలేదు. ప్రస్తుతం భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో బ్యాకప్ బ్యాటర్ అవసరం లేదని సెలక్టర్లు భావించారు. ఈ కారణంగానే అయ్యర్ ఎంట్రీతో గైక్వాడ్ పై వేటు పడింది. గైక్వాడ్ స్థానంలో అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.