నాపై విషప్రయోగం జరిగింది: కేఏ పాల్

నాపై విషప్రయోగం జరిగింది: కేఏ పాల్

హైదరాబాద్, వెలుగు : రాజకీయ కుట్రలో భాగంగా తనను చంపటానికి ప్రయత్నించారని, గత నెల 25న తనపై విష ప్రయోగం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. తనకు ఆహారంలో విషం ఇచ్చారని, దేవుడి దయ వల్ల బతికానని శుక్రవారం పత్రిక ప్రకటనలో చెప్పారు. 

ప్రస్తుతం వైజాగ్ లో ఓ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని పాల్ పేర్కొన్నారు. ఈ విషప్రయోగంతో నరకం అనుభవించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గత 10 రోజులుగా ఎవరికి అందుబాటులో లేనని, త్వరలో కోలుకుని వస్తానని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.