విశాఖ ఉక్కు పోరాటంలో.. కలిసిపోయిన కేఏ పాల్ : జేడీ లక్ష్మీనారాయణ

విశాఖ ఉక్కు పోరాటంలో.. కలిసిపోయిన కేఏ పాల్ : జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఆ ఇద్దరినీ కలిపింది. ఇద్దరిది వేర్వే భావజాలం.. వేర్వేరు పార్టీలు.. వేర్వేరు అభిప్రాయాలు అయినా.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంలో.. ఇద్దరు కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకోవటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఏప్రిల్ 19వ తేదీ వీళ్లిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టటం ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది. కేఏ పాల్ కు చాలా మంది తెలుసు.. ఆయన వల్ల అవుతుందనే ఉద్దేశంతోనే ఆయనతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే.. ఉక్కు కోసం బిడ్డు వేసిన లక్ష్మీనారాయణ చిత్తశుద్ధి నచ్చిందంటూ కేఏ పాల్ పొగడ్తల వర్షం కురిపించారు. కేఏ పాల్ – లక్ష్మీనారాయణ కలిసి పెట్టిన ప్రెస్ మీట్ లో.. ఎవరు ఏం మాట్లాడారో చూద్దాం...

కేఏ పాల్ : ప్రజాశాంతి పార్టీ

స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణ అంశంపై మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు. కేఏ పాల్ మొదటి అంశాన్ని తీసుకుంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేయాలని కేఏ పాల్ కోరారు. ఈ ముగ్గురు జడ్జీలు తెలుగు వాళ్లు అయ్యి ఉండాలని కోరారు. వాళ్ల ద్వారా అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతోపాటు ప్రజల మనోభావాలపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు పాల్.

రెండో అంశానికి వస్తే.. అమ్మాలి అని డిసైడ్ అయినప్పుడు.. అది నాకే అమ్మాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కావాల్సిన డబ్బును అమెరికా నుంచి తీసుకొస్తానని.. అడ్వాన్స్ కింద 5 బిలియన్ డాలర్లు చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో 42 వేల కోట్ల రూపాయలు చెల్లించటానికి రెడీగా ఉన్నానని.. ఎఫ్ డీఐ.. విదేశీ పెట్టుబడుల కింద తీసుకొస్తానని.. నాకే అమ్మాలని డిమాండ్ చేశారు పాల్.మూడో అంశానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించినప్పుడు.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని.. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం ఉన్నా.. దాన్ని నిర్వహించే బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. 

 ప్రైవేటీకరణకు 99 శాతం రెడీ అయ్యారని, ఎన్నికలు కావటంతో రాజకీయాల కోసం డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3 వేల 500 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నాయని చెప్పారు. అప్పట్లో ఒక ఎకరం 2, 3 లక్షలు మాత్రమే అని చెప్పారు.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ :

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మాత్రమే ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని, సెయిల్ ను ఎందుకు ప్రైవేటీకరణ చేయటం లేదని ప్రశ్నించారు. 2017లో నేషనల్ స్టీల్ పాలసీ తీసుకొచ్చారని.. 2030 నాటికి స్టీల్ కెపాసిటీ 300 మిలియన్ టన్నులు చేయాలనేది లక్ష్యం అని చెప్పారు. 122 మిలియన్ టన్నులు ప్రస్తుతం నడుస్తుందని.. మన స్టీల్ ప్లాంట్ కెపాసిటీ పెంచుకోవాలన్నారు. సెయిల్ కింద ఉన్న స్టీల్ కంపెనీని కెపాసిటీ పెంచాలని నిర్ణయించిందన్నారు. విశాఖపట్నం విషయంలో మాత్రం ఎవరికో అమ్మేయాలని నిర్ణయించారని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ను సెయిల్ ఆధ్వర్యంలో ఉంచి.. డెవలప్ చేయాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినట్లయితే.. మరో 7 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చన్నారు. ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ రూల్స్ ఉన్నాయని, విదేశాల నుంచి డబ్బులు తీసుకురావొచ్చన్నారు. ఆచరణ ఎలా ఉంటుందనేది తర్వాత చూద్దామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తో తాను మాట్లాడనని చెప్పారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం విషయంలో కేఏ పాల్ – జేడీ లక్ష్మీనారాయణ ఒకే వేదికపైకి రావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎలా తీసుకుంటాయి అనేది ఆసక్తి రేపుతోంది..

https://www.youtube.com/watch?v=qU6UwEJGxwc