
విశాఖ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చెప్పారు. మంచి అభ్యర్థులు ఉంటే ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తానన్నారు. బీజేపీ తెలంగాణలో భూ స్థాపితం అవుతుందన్నారు. ప్రభుత్వం కులగొట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని.. అలా జరిగితే ఉద్యమం జరుగుతుందన్నారు.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళితే వాళ్ళపై కేసు వేస్తానన్నారు కేఏపాల్. తాగునీటి సమస్యలు నల్గొండ జిల్లాను ఇబ్బందులు పెడుతుంటే కోమటిరెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఈడీ పేరుతో బెదిరిస్తుందని.. అవినీతి పరులు దేశంలో చాలా మంది ఉన్నారని తెలిపారు. మొదటి నుంచి తాను నిజాలు చెప్పినా మీడియా వినలేదన్నారు.
కేసీఆర్ పై తాను ఐదు కేసులు వేసి గెలిచానన్నారు కేఏపాల్ . కొత్త కట్టడాల పేరుతో ప్రజలకు నష్టం చేశారని.. అందుకే కేసీఆర్ ను ప్రజలు ఓడించారన్నారు. తనను చంపడానికి, జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్రలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ తో యువత తప్పుదోవ పడుతుందని.. నాయకులు కూడా ఈ కేసులో ఉన్నారన్నారు. మంచి నీళ్లు ఇవ్వడం లేదు.. కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తన మాటలు గాలికి వదిలేయొద్దని..తాను వాస్తవాలు మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం కోసం తాను పని చేస్తున్న తన మాటలను ప్రజలు పట్టించుకోకపోతే శాపం తగులుతుందన్నారు కేఏపాల్.