ఈవీఎంలు లేకుండా ఎన్నికలు పెట్టాలి : కేఏ పాల్

ఈవీఎంలు లేకుండా ఎన్నికలు పెట్టాలి : కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: ఈవీఎంలతో జరిగే ఎన్నికలు కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరుస్తున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇకపై దేశవ్యాప్తంగా నిర్వహించబోయే ఎన్నికలను ఈవీఎంలు లేకుండా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో పాల్‌‌ మీడియాతో మాట్లాడారు. 75 ఏండ్లు దాటిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని హితవు పలికారు. తదుపరి ప్రధానిగా అమిత్‌‌షా కు అవకాశం ఇవ్వాలన్నారు.