ఫ్రీగా వీసా, పాస్ పోర్ట్ ఇచ్చి అమెరికాకు పంపుతా

ఫ్రీగా  వీసా, పాస్ పోర్ట్ ఇచ్చి అమెరికాకు పంపుతా
  • ఇంటికో ఉద్యోగమని చెప్పి కేసీఆర్ మాట తప్పిండు
  • ప్రజా శాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్

హైదరాబాద్: అక్టోబర్ 2న హైదరాబాద్ లో ప్రపంచ శాంతి సభ నిర్వహించనున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాలు తెలిపారు. సికింద్రాబాద్ లోని హరిహర కళా భవన్ లో ప్రజా గాయకుడు గద్దర్, టీజేఎస్పీ ప్రెసిడెంట్ కోదండరాంతో కలిసి శాంతి సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేసినట్లు పాలన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో తమ సభ జరగనుందని, సభకు  అనుమతినిచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాల్ ధన్యవాదాలు తెలిపారు. 15 ఏండ్ల తరువాత ఇలాంటి సభ ద్వారా దేశ గొప్పదనాన్ని  ప్రపంచ దేశాలకు ప్రమోట్ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. అభివృద్ధిలో భారత్ వెనకపడుతోందని, దీనికి పాలకులేకారణమన్నారు. 

భారత్ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని మాటిచ్చిన కేసీఆర్... సీఎం అయ్యాక నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఆ రోజు తన వద్దకు వచ్చిన నిరుద్యోగ యువతలో డ్రా ద్వారం 59 మందిని సెలెక్ట్ చేసి అమెరికా వెళ్లేందుకు వీసా, పాస్ పోర్ట్ ఉచితంగా ఇప్పిస్తామని చెప్పారు. అదే విధంగా మునుగోడు నిరుద్యోగులకు అమెరికా వెళ్లేందుకు వీసా, పాస్ పోర్ట్ ఫ్రీగా ఇస్తామని పేర్కొన్నారు. తమ సభకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నామన్న పాల్ పేర్కొన్నాడు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తమ సభకు తరలిరావాలని పాల్ కోరారు.