కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థించా: కేఏ పాల్

కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థించా:  కేఏ పాల్

రాజకీయాలకు అతీతంగా అందరూ కేసీఆర్ బాగుండాలని కోరుకోవాలని అన్నారు కేఏ పాల్. డిసెంబర్ 12వ తేదీ మంగళవారం ఉదయం కేసీఆర్ ను పరామర్శించి వచ్చిన కేఏ పాల్.. మధ్యాహ్నం మరోసారి  యశోద ఆస్పత్రికి వచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఒకసారి చూశారు కదా.. మళ్లీ వద్దులేండీ.. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారని  కేఏ పాల్ ను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రెండోసారి ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీంతో ఆయన వెనుతిరుగుతూ మీడియాతో మాట్లాడారు.

డాక్టర్లు కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నారని... కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని అన్నారు.  కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థించానన్నారు. ఆస్పత్రిలో వైద్యులు అద్భుతమైన చికిత్స అందిస్తున్నప్పటికీ ప్రార్థనలు అన్నింటికన్నా మోస్ట్ పవర్ ఫుల్ అని అన్నారు. జీవితంలో ఏది జరగినప్పటికీ అన్నీ మన మంచికేనని.. కేసీఆర్ కు ఇంత పెద్ద యాక్సిడెంట్ అవడమేంటనీ మనకెవరికీ అర్థం కాదని.. కానీ ఆయన దేవుడికి దగ్గరవుతున్నారని చెప్పారు. ఈ 70ఏళ్లలో లేని విధంగా కేసీఆర్, దేవుడికి అత్యంత దగ్గరయ్యారని అన్నారు.

బీఆరెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున యశోద హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు ఎవ్వరినీ ఆస్పత్రిలోకి అనుమతించడంలేదు.. వచ్చిన వారిని వచ్చినట్లే తిరిగి పంపించేస్తుండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.