
తన భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంతకుముందు ఆయనపై జరిగిన దాడిని సుమోటోగా స్వీకరించిన కోర్టు 30 రోజుల్లోగా పాల్ కు ఉన్న ముప్పును పరిశీలించి ఆయన భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. వాదానల సందర్భంగా సచివాలయ ఫైర్ యాక్సిడెంట్ ఘటనను పాల్ ప్రస్తావించగా... ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో జీపీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని పాల్ వాదించారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా ప్రమాదంపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. కేవలం తన భద్రతపైనే వాదించాలని, ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని పాల్ ను చీఫ్ జస్టిస్ సూచించారు. కాగా గతేడాది రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన పాల్ పై ఓ యువకుడు దాడి చేశాడు. పాల్ ను అతను చెంపదెబ్బ కొట్టడంతో అది వివాదంగా మారింది.