హిందీ మూవీలో విలన్గా అదరగొట్టిన కరీంనగర్ యువకుడు

హిందీ మూవీలో విలన్గా అదరగొట్టిన కరీంనగర్ యువకుడు
  • కరీంనగర్ కుర్రాడికి మంచి ఆదరణ

పూణే ఫిల్మ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ స్టూడెంట్స్ ముఖ్యపాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘కాలా బార్బేరియన్ చాప్టర్‌‌‌‌‌‌‌‌ 1’. కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రజ్ఞన్‌‌‌‌ విలన్‌‌‌‌గా నటించాడు. వరుణ్ సింగ్ రాజ్‌‌‌‌పుత్, స్థుతి, చయనిక ఇతర ముఖ్యపాత్రల్లో జింటో చాకో శామ్యూల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రస్తుతం ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఎక్స్‌‌‌‌ట్రీమ్, హంగామా ఓటీటీ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటించిన కరీంనగర్ కుర్రాడు  ప్రజ్ఞన్‌‌‌‌ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ప్రజ్ఞన్‌‌‌‌ మాట్లాడుతూ ‘చయనిక చౌదరితో కలిసి నటించిన సీన్స్‌‌‌‌కు మంచి అప్లాజ్ వస్తుంది.  పూణే ఫిల్మ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకున్న పలువురు దర్శకులు ఫోన్ చేసి ప్రశంసించడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ హీరోతో నటించే చాన్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీని గారికి ధన్యవాదాలు . మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌‌‌‌కి స్కోప్ ఉన్న పాత్ర ఇది’ అన్నాడు.