అంబేద్కర్ కాలేజీలో ముగిసిన కబడ్డీ టోర్నమెంట్

అంబేద్కర్ కాలేజీలో ముగిసిన కబడ్డీ టోర్నమెంట్

ముషీరాబాద్,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కాలేజీలకు టోర్నమెంట్ లో భాగంగా శనివారం రెండు రోజు పోటీలు బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఉత్సాహంగా మొదలై ముగిశాయి. 46 కాలేజీల టీమ్​లు టోర్నమెంట్​ లో  పాల్గొనగా ఏవీ కాలేజీ విజేతగా,  ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రన్నర్ గా,  రైల్వే డిగ్రీ కాలేజ్, హిందీ మహా విద్యాలయ్ కాలేజీ మూడో ప్లేసులో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ వి. సత్యనారాయణ హాజరై  విజేత టీమ్ లకు మోమెంటోలు, మెడల్స్ అందజేసి మాట్లాడారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అంబేద్కర్ కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టోర్నమెంట్ నిర్వాహకులు, అంబేద్కర్ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.