ట్రైన్లో మైనర్ బాలికతో హోంగార్డ్ వికృత చేష్టలు ..అరెస్ట్

ట్రైన్లో మైనర్ బాలికతో హోంగార్డ్ వికృత చేష్టలు ..అరెస్ట్

హైదరాబాద్: ట్రైన్లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్​లో  వస్తుండగా బాలిక పట్ల హోంగార్డు ప్రతాప్ అసభ్యంగా ప్రవర్తించాడు. నిద్రిస్తున్న బాలిక వద్దకు వెళ్లి వికృత చేష్టలు చేయడంతో గమనించిన బాలిక తం డ్రి రైల్వే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.

రైలు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ప్రతాప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హోంగార్డు యూనిఫాంలో ఉండి టికెట్ లేకుండా ప్రయాణించినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రతాప్ ఆంధ్రప్రదేశ్ లోని కోడూరు పీఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై పొక్సో కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు కాచిగూడ పోలీసులు.