కచోరీలమ్మే వ్యక్తి వార్షిక ఆదాయం కోటిపైనే

కచోరీలమ్మే వ్యక్తి వార్షిక ఆదాయం కోటిపైనే

కచోరీలు అమ్మే షాపు ఆదాయం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏడాదికి కచోరీలు, సమోసాల ద్వారా ఈ షాపు యజమానికి రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నాడట. ఉదయాన్నే షాపు తెరవగానే మొదలయ్యే క్యూ, రాత్రి మూసే వరకూ అలాగే ఉంటుందట. ఉత్తరప్రదేశ్ లోని ఆలీఘర్ లో ఉందీ  ‘ముకేశ్ కచోరీ’ దుకాణం. ఇటీవల ఎవరో ఈయన ఆదాయంపై కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.

అసలెంటో తెలుసుకునేందుకు ఆఫీసర్లు ముకేశ్ షాపు ముందు కాసేపు కూర్చున్నారు. అమ్మకాలు జోరుగా ఉండటం చూసి, జీఎస్టీ కింద రిజిస్టర్ అయ్యారా లేదా అని ప్రశ్నించారు. లేదనే సమాధానం. వెంటనే ట్యాక్సు కడుతున్నారా అనే ప్రశ్న. అదీ లేదు. ‘నాకు ఇవన్నీ చేయాలని తెలియదు. 12 ఏళ్లుగా షాపు నడుపుతున్నా. ఇలా పన్నులు కట్టాలని నాకెవరూ చెప్పలేదు. బతకడానికి కచోరీలు, సమోసాలు అమ్ముకుంటున్నా’ అని యజమాని ముకేశ్ వెల్లడించారు.