AP News: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

AP News:  కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..  ఐదుగురు మృతి

 కడప జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో   ఐదుగురు మృతి చెందారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్​ లో  ఈ ఘటన చోటుచేసుకుంది. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండ గా గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంగా ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.