ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మళ్లీ రావాలని సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈనెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ  విచారణకు హాజరుకానున్నారు.

మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్టు అయిన అవినాష్ తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను కూడా సీబీఐ అధికారులను విచారించారు. వీరిద్దర్నీ దాదాపు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించారు. వివేకా హత్యకు దారితీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపైనే విచారణ సాగినట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేశారు సీబీఐ అధికారులు.