నిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. 3 గేట్లు ఎత్తిన అధికారులు.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక

నిండు కుండలా కడెం ప్రాజెక్ట్.. 3 గేట్లు ఎత్తిన అధికారులు.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు సైతం జలకళను సంతరించుకుంది. 

ప్రాజెక్టు నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.6 టీఎంసీల నీరు ఉన్నాయి. 700 అడుగుల నీటి మట్టానికి గానూ 696 అడుగుల మేర నీరుంది. ఇన్​ఫ్లో పెరుగుతుండటంతో​ మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  

ALSO READ : రేప్ చేయటానికి ప్రయత్నించాడు.. కుదరకపోవటంతో చంపేశాడు..

ప్రస్తుతం ఇన్​ఫ్లో 29 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్​ఫ్లో 39 వేల క్యూసెక్కులుగా ఉంది.  ముంపు ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు.