కడెం గేట్లు ఓపెన్

కడెం గేట్లు ఓపెన్

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో శనివారం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్ట్ లోకి 5,400 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, 2 గేట్లను ఎత్తి 10,108 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతానికి వెళ్లవద్దని ప్రాజెక్టు అధికారులు సూచించారు. - కడెం, వెలుగు