మేడారం జాతర పనుల్లో జాప్యం.. అధికారులపై అసంతృప్తి

మేడారం జాతర పనుల్లో జాప్యం.. అధికారులపై అసంతృప్తి

ములుగు: మేడారం జాతర పనులలో జాప్యం జరగుతుందని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి. జాతర మొదలయ్యే వరకు పనులు పూర్తయ్యేలా లేవని ఆయన ఫైర్ అయ్యారు. మంత్రులు మేడారంపై దృష్టి సారించాలని కోరారు. జాతర డేట్ దగ్గరికి వస్తుండటంతో హడావుడిగా పనులు చేస్తున్నారని.. మొదటి నుంచి ప్లాన్డ్ గా పనులు చేసుకుంటూ వెళ్తే బాగుండేదని అన్నారు. జనగామ నుంచి మేడారం వరకు రోడ్డు పనులు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు. జాతర పనులల్లో అధికారుల అలసత్వం కనడడుతుందని అన్నారు. 2018లోకూడా అధికారులు ఇలాగే చేశారని ఇప్పుడు కూడా పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని చెప్పారు.