వన్య ప్రాణుల దూప తీరుస్తున్రు .. కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో 170 సాసర్ పిట్స్

వన్య ప్రాణుల దూప తీరుస్తున్రు .. కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో 170 సాసర్ పిట్స్
  • సత్పలితాలనిస్తున్న సాసర్ పిట్స్       

ఆసిఫాబాద్/కాగజ్ నగర్ వెలుగు : అరుదైన వన్యప్రాణులు, జంతు జీవజాలానికి నిలయమైన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ (నీటి గుంటలు) సత్పలితాలనిస్తున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు అడుగంటడంతో అటవీ ప్రాంతాల్లోని వణ్యప్రాణులు ఈ సాసర్​ పిట్స్​లో దప్పిక తీర్చుకుంటున్నాయి. ఈ నీటి గుంతల్లో ఎప్పటికప్పుడు నీళ్లను అటవీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నింపుతున్నారు. 

చిన్న ప్రాణులు మొదలుకొని పులి, జింకలు ఈ సాసర్​ పిట్స్​లో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కుతున్నాయి. కాగజ్ నగర్ ఎఫ్​డీవో సుశాంత్ బోబడే మాట్లాడుతూ.. సహజంగా ఉన్న నీటి వనరులను పరిరక్షిస్తూ మరో 170 నీటి గుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండాకాలంలో వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ నిరంతరం సిబ్బందిని అలర్ట్ చేస్తున్నామని చెప్పారు.