
మహేశ్ బాబు(Mahesh babu) గుంటూరు కారం(Guntur karam)లో మూడో హీరోయిన్ ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. లేటెస్ట్గా వినిపిస్తున్న బజ్ ప్రకారం కాజల్ అగర్వాల్(Kajal agarwal) కూడా ఓ కీలక రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది.
గతంలో మహేశ్‌తో కలిసి కాజల్ నటించిన ‘బిజినెస్‌మ్యాన్’ బ్లాక్‌బస్టర్ హిట్టందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడీ రిపీట్ కానుందనే వార్త ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక కాజల్ అగర్వాల్ తన భర్తతో వెకేషన్లో బిజీగా ఉంది. త్వరలోనే షూటింగ్లో జాయిన్ కానుందట. మహేశ్ 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.