ఉమగా చందమామ..కొత్త సినిమాపై కాజల్ క్లారిటీ

V6 Velugu Posted on Jun 05, 2021

కాజల్‌ సినిమాలు మానేస్తోంది అంటూ వారానికోసారైనా గుసగుసలు వినిపిస్తుంటాయి. తన భర్తకి ఇష్టం లేని రోజున యాక్టి చేయడం మానేస్తానని, ఆయనకి తాను నటించడం ఇష్టం కాబట్టే కంటిన్యూ అవుతున్నానని రీసెంట్‌గా కాజల్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడో కొత్త సినిమాని అనౌన్స్ చేసి తప్పుడు ప్రచారాలకి ఫుల్‌ స్టాప్ కూడా పెట్టేసింది. ఇప్పటికే కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. తమిళంలో హే సినామికా, ఘోస్టీ, ఇండియన్ 2 చిత్రాలు చేస్తోంది. తెలుగులో ‘ఆచార్య’తో పాటు నాగార్జున, ప్రవీణ్ సత్తారుల మూవీలోనూ నటిస్తోంది. మరోవైపు వెబ్‌ సిరీసులపై కూడా దృష్టి పెట్టింది. ఆల్రెడీ ‘లైవ్‌ టెలికాస్ట్’ అనే హారర్ సిరీస్ చేసింది. ఇప్పుడు జయశంకర్ డైరెక్షన్‌లో మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టింది.

తథాగత సింఘా డైరెక్షన్‌లో ‘ఉమ’ అనే ప్యాన్ ఇండియా మూవీ చేయబోతోంది. అవిషేక్‌ ఘోష్, మంత్రరాజ్ పలివాల్ నిర్మిస్తున్నారు. ఇదొక స్లైస్‌ ఆఫ్‌ లైఫ్‌ ఫిల్మ్ అని, కాజల్‌ చుట్టూనే కథ తిరుగుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలోనే రివీల్ చేస్తామన్నారు. కాజల్‌ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తోందంటూ జరుగుతున్న ప్రచారానికి ఈ అనౌన్స్‌మెంట్ బలాన్ని చేకూర్చింది. అయినా ఇప్పుడు హీరోయిన్లందరూ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. హీరోల పక్కన మెరుస్తూనే తమ సత్తా చాటగల కాన్సెప్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరి కాజల్‌ అలా కోరుకోవడంలో తప్పేముంది!

Tagged cinema, Kajal Aggarwal, uma, , Pan India, directer Singha

Latest Videos

Subscribe Now

More News