
రీసెంట్ గా రిలీజైన లస్ట్ స్టోరీస్ 2(Lust stories2) సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ కాజోల్(Kajol). బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2018 లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన లస్ట్ స్టోరీస్(Lust stories) సిరీస్ కు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ తో కంపేర్ చేస్తే.. సీక్వెల్ లోనే ఎక్కువ మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. కాజోల్(Kajol),తమన్నా(Thamannaah),మృణాల్(Mrunal),విజయ్ వర్మ(Vijay varma).. ఇలా చాలామంది స్టార్ ఈ సీరీస్ లో యాక్ట్ చేశారు. అయినా కూడా ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. లస్ట్ స్టోరీస్2 గురించి, తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే? కాజోల్ సినిమాలను తన పిల్లలు అస్సలు చూడరట. పిల్లలే కాదు తన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటీవ్స్ కూడా చూడటానికి ఇష్టపడరట. దానికి కారణం.. కాజోల్ ఏడ్చే సీన్స్ లో నటించడమే. కాజోల్ ఏడవడం తన పిల్లలతో సహా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికీ నచ్చదట. అందుకే వాళ్ళెవరూ కాజోల్ సినిమాలు చూడటానికి ఇష్టపడరట.
Also Read :-కన్న తండ్రే వేధిస్తున్నాడు..
ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ అవాక్కవుతున్నారు. మీరు చేసిన సినిమాలు మీ ఇంట్లో వాళ్ళే చూడకపోతే ఇంకెవరు చూస్తారు. అలాగే అది నటన కదా దాన్ని సీరియస్ గా తీసుకోవడం ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కాజోల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.