
హీరోయిన్ ఆర్థనా బిను(Arthana Binu) తన తండ్రి విజయ్ కుమార్ (Vijayakumar) పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్( Raj Tarun) హీరోగా వచ్చిన ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’ అనే సినిమాలో ఆర్థనా హీరోయిన్గా నటించింది. మళయాల పరిశ్రమకు చెందిన ఈ నటి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో..
“ఈరోజు అతను మా కాంపౌండ్ లోకి ప్రవేశించాడు. అప్పటికే మేము తలుపు లోపలి నుంచి గడియపెట్టుకున్నాం. దీంతో అతను కిటికీ ద్వారా మమ్మల్ని బెదిరించాడు. నా సోదరిని, అమ్మను చంపేస్తానని బెదిరించాడు. నేను సినిమాల్లో నటించడం మానేయాలని..లేదంటే ఎంతకైనా తెగిస్తానని బెదిరించాడు. కిటికిని కొడుతూ పెద్దగా అరిచాడు. బతుకుదెరువు కోసం మా అమ్మ నన్ను అమ్మేస్తోందని అరుస్తున్నాడు. ఇటీవల నేను నటించిన చిత్రబృందంతోనూ చెడుగా మాట్లాడాడు.
https://www.instagram.com/reel/CuQ2m_2pxHV/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
ఒకవేళ నాకు నటించాలని ఉంటే అతను చెప్పిన సినిమాల్లోనే నటించాలని అంటున్నాడు. నేను పనిచేస్తున్న సెట్ లోకి, మా అమ్మ పనిచేసే కార్యాలయంలోకి వెళ్లి గొడవ చేస్తున్నాడు. అతనిపై కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇదంతా చేస్తున్నాడు. నేను సినిమాలు నటించకుండా ఆపాలని కేసు పెట్టాడు. అప్పుడు నేను నా ఇష్టానికి సినిమాల్లో నటిస్తున్నానని.. నేను ఆరోగ్యంగా ఉన్నంతకాలం నటిస్తుంటాను. నేను షైలాక్ సినిమాలో నటించినప్పుడు అతను లీగల్ గా కేసు పెట్టాడు.
దీంతో ఆ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు నేను నా ఇష్టానుసారంగా సినిమాలో నటిస్తున్నానని చట్టపరమైన పత్రంపై సంతకం చేయాల్సి వచ్చింది” అంటూ తన ఆవేదనను పంచుకుంది.
అర్థనా బిను షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో పోలీసులు స్పందిస్తారని, తనకు ఎలాగైనా న్యాయం చేయగలరు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.