Kaka Cricket Cup Finals.. గ్రాండ్ విక్టరీ విన్నర్ రామగుండం టీమ్

Kaka Cricket Cup Finals..  గ్రాండ్ విక్టరీ విన్నర్ రామగుండం టీమ్

కాకా క్రికెట్ టోర్నీలో ఫైనల్స్ లో రామగుండం టీమ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నూరుపై 4 వికెట్ల తేడాతో రామగుండం టీమ్ గెలుపొందింది. ఈ సందర్భంగా విన్నర్స్ కి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్ లు ట్రోఫీ, ప్రైజ్ మనీని అందజేశారు. ఫైనల్స్లో విన్నర్స్ కి రూ. 3 లక్షలు..  రన్నర్స్ కి రూ. 2 లక్షల నగదు బహుమతిని అందించారు. 17 ఓవర్లలో 84 పరుగుల టార్గెట్ ని ఛేదించింది. 25 బంతుల్లో 35 రన్స్ క్రాంతి కుమార్ చేశారు. సమర్ జిత్ 15, ప్రకాష్  13 రన్స్ చేశారు. అంతకుముందు చెన్నూరు  టీమ్ టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగింది. 10 వికెట్ల నష్టానికి చెన్నూరు టీమ్  84 రన్స్ చేసింది. చెన్నూరు బౌలర్ ప్రవీణ్ ఐదు వికెట్లు తీశాడు. 

తన చిన్నతనంలో ఇక్కడే క్రికెట్ ఆడేవాళ్లమని... స్కూల్, కాలేజ్ లో ఎన్నో మ్యాచ్ లు గెలిచామని గుర్తు చేసుకున్నారు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మించేందుకు తామే స్పాన్సర్ షిప్ చేశామని పేర్కొన్నారు. వరల్డ్ కప్ కి టాక్స్ ఏక్సిమ్ప్ షన్ తెచ్చింది మా నాన్న(కాకా వెంకట స్వామి) గారేనని చెప్పారు. రూరల్ లో క్రికెట్ అభివృద్ధి కోసం టీపీఎల్ నిర్వహించామని.. హైదరాబాద్, రంగారెడ్డి జట్లు కాకుండా.... ఆదిలాబాద్ టీమ్ విన్ అయిందని తెలిపారు. పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రావు ఇద్దరినీ తమ నియోజకవర్గాల్లో టార్ఫ్ వికెట్ ఏర్పాటు చెయ్యాలని కోరారని... 2024 నవంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా లీగ్ నిర్వహిస్తామని వివేక్ వెంకట స్వామి తెలిపారు. 

ALSO READ :- Janhvi Kapoor: జాన్వీ చీరకట్టిన గ్లామర్ డోస్ దట్టించడంలో తగ్గేదే లే!

కాకా క్రికెట్  టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందని గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వెంకటస్వామి, వినోద్, వివేక్ లకి క్రికెట్ తో విడదీయరాని బంధం ఉందని.. గ్రామీణ ప్లేయర్లకి చేయూత అందించేందుకు తాము ఎప్పుడు ముందు ఉంటామని చెప్పారు. ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తామని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.