వాక్సినేషన్ కోసం కాకా ఫౌండేషన్​ ఉచిత ప్రయాణం

వాక్సినేషన్ కోసం కాకా ఫౌండేషన్​ ఉచిత ప్రయాణం

చెన్నూర్ నుంచి హాస్పిటల్ వెళ్లే పేదల కోసం ఆటోల ఏర్పాటు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో చెన్నూర్ ​టౌన్ ​నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ వరకు కాకా ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ నేత పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఏర్పాటు చేసిన ఉచిత రవాణా ఆటోలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ వీటిని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల క్షేమమే కాకా ఫౌండేషన్ ముఖ్య లక్ష్యమని ఆయన చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజల కోసం కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుంటే, ఉపాధి లేక అలమటిస్తున్న పేదలకు కాకా ఫౌండేషన్ అండగా నిలిచి, నిత్యావసర సరకులను పంపిణీ చేస్తోందన్నారు. ఇటీవల చెన్నూర్​పట్టణంలోని పేద ప్రజలు రవాణా లేక వ్యాక్సినేషన్​సెంటర్​కు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని మాజీ ఎంపీ వెంకటస్వామి దృష్టికి తెచ్చారని, వెంటనే స్పందించిన ఆయన చెన్నూర్ నుంచి ఎల్లక్కపేట ఆసుపత్రి వరకు ఉచితంగా ఆటోల సౌకర్యం కల్పించారన్నారు. అంతే కాకుండా కొవిడ్ బారిన పడ్డ ప్రజల సౌకర్యార్థం గతంలో ఆసుపత్రికి కాన్సెంట్రేట్ మిషన్ అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుద్దంపల్లి సుశీల్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొంపల్లి బానేష్, పెండ్యాల శ్రీకాంత్, సీనియర్ నాయకులు కొండపాక చారి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీపాల్, నాయకులు అమిరిశెట్టి రమేశ్, అక్షిత్ శర్మ, పోగుల సాయి, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.