మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాయికినిపేటకు చెందిన ఓడేటి హనుమంతు ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతుండగా అతడికి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా నిలిచింది. మంచిర్యాలలోని సన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి 25వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఆయన ఆదేశాల మేరకు నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొమ్మన హరీశ్గౌడ్ గురువారం హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు అందజేశారు. హనుమంతు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఏ సమస్య వచ్చిన కాకా ఫౌండేషన్ తరపున వివేక్ వెంకటస్వామి అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
