తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా మెమోరియల్ స్మారకార్థం నిర్వహించే తెలంగాణ టీ-20 క్రికెట్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక పోటీలు అలుగునూర్‌లోని క్రికెట్ స్టేడియంలో నిర్వహించారు. కరీంనగర్, జగిత్యాలకు చెందిన క్రీడాకారుల ఎంపిక 18న జరగగా, శుక్రవారం పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన క్రీడాకారులకు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ నెల 22 నుంచి పోటీలు జరగనున్నట్లు కరీంనగర్ క్రికెట్అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శులు ఎన్.మురళీధర్‌రావు తెలిపారు.
