ఇందిరా గాంధీకి బెయిల్ ఇప్పించడంలో కాకా పాత్ర కీలకం: ఎమ్మెల్యే గడ్డం వినోద్

ఇందిరా గాంధీకి బెయిల్ ఇప్పించడంలో కాకా పాత్ర కీలకం: ఎమ్మెల్యే గడ్డం వినోద్

హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.. కాకా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాకా ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు కాకా వెంకటస్వామి చేసిన కృషిని గురించి చెప్పారు. 1977లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిన సందర్భంలో ఇందిరాగాంధీని అరెస్టు చేసి జైళ్లో వేశారు. ఇందిరాగాంధీని కామన్ సెల్ లో వేయొద్దని చెప్పి.. రెండు రోజుల్లో బెయిల్ ఇప్పించడంలో కాకా కీలక పాత్ర వహించినట్లు తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ప్రసిడెంట్ దేవకాంత్ బర్వా.. ఇందిరా ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పుడు 24 అక్బర్ రోడ్డులో ఉన్న సొంత ఇల్లును కాంగ్రెస్ కు ఇచ్చిన ఘనత కాకా వెంకటస్వామిది అపి కొనియాడారు.

తమ తండ్రి కాకా వెంకటస్వామి కారణంగానే తాము ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. కాకా మీద కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీకి ఉన్న గౌరవం మేరకే ఒక ఇంట్లో మూడు పదవులు దక్కాయని అన్నారు.  

కాకా బాటలో పేదల సేవ కోసం కృషి  చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే వినోద్.. వీకర్ సెక్షన్ కోసం పనిచేస్తామని.. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.