దేశంలో అనేక కార్మిక చట్టాలు తేవడంలో కాకా కృషి

దేశంలో అనేక కార్మిక చట్టాలు తేవడంలో కాకా  కృషి

ఈ తరం నాయకులకు కాకా వెంకటస్వామి ఓ మార్గదర్శి అని మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మిక నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకటస్వామి..దేశ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. దేశంలో అనేక కార్మిక చట్టాలు తేవడంలో ఆయన కృషి చేశారన్నారు. కరీంనగర్ లోని  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి,దివంగత నేత కాక వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్..వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

తెలంగాణ ఉద్యమంలో కాకా పాత్ర మరువలేనిదని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటును కళ్లనిండా చూసి సంతృప్తితో ఆయన కన్నుమూసారని గుర్తు చేశారు. వెంకటస్వామి, చొక్కారావు, ఎమ్మెస్సార్ లాంటి నేతల జీవితాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.