కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేసిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని మాజీ మంత్రి జి.వినోద్ అన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ జీడిమెట్లలో తెలంగాణ స్టేట్ ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సంక్షేమం కోసం కృషిచేశానని వినోద్ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల కోసం కార్మిక సోదరులను చైతన్యపరిచే కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ రామగుండం, గోదావరి ఖని ప్రాంతాల సింగరేణి కార్మికుల్లో ఎంతో మార్పు వచ్చింది. నేను కళ్లారా చూశాను. వాళ్ల పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. అంటే మార్పు వచ్చేసింది. ఆవిధంగా కార్మికులంతా మారాలి.. ఆలోచన మార్చుకోవాలి. జీవితాల్లో ఎదగాలి. ప్రస్తుత పరిస్థితులేంటి ? ఎవరికి ఓటేయాలి ? అనే దానిపైనా ఆలోచన పెంచుకోవాలి’’ అని జి.వినోద్ సూచించారు.
మరిన్ని వార్తలు..
