ఇవాళ్టి (డిసెంబర్ 22) నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ ..తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్

ఇవాళ్టి (డిసెంబర్ 22) నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ ..తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్
  •  
  • విశాక స్పాన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిర్వహిస్తున్న హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ 
  • రెండు దశల్లో మెగా టోర్నీ
  • తొలి ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29 జిల్లాల జట్ల పోటీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ మహబూబ్​నగర్  వెలుగు:  తెలంగాణ పల్లెల్లో దాగివున్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు అద్భుత వేదిక సిద్ధమైంది. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేళయింది. ఈ మెగా టోర్నమెంట్ తొలి అంచె పోటీలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్​నగర్​ జిల్లా క్రికెట్​ అసోసియేషన్​ (ఎండీసీఏ) క్రికెట్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ప్రారంభోత్సవానికి  రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, రాష్ర్ట ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్​ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, శాట్జ్​ చైర్మన్​ శివసేనారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జట్టుతో నాగర్ కర్నూల్ తలపడనుంది. ఆదివారం ఎంసీఏ స్టేడియాన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించారు. ఎండీసీఏ సెక్రటరీ రాజశేఖర్ నేతృత్వంలో  ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిచ్, గ్రౌండ్ సిద్ధం చేశారు. ఈ మెగా టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.

  ఈ నెల 27 వరకు జరిగే తొలి ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల జట్లు పోటీ పడుతున్నాయి. వీటిని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 8 జోన్లుగా (వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, మెదక్) విభజించారు. రౌండ్ రాబిన్, ఫైనల్ పద్ధతిలో ఆయా జిల్లా కేంద్రాల్లోనే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. జోనల్ విజేతలుగా నిలిచిన 8 జట్లు రెండో దశ అయిన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 29 నుంచి జరిగే  సెకండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ 8 జట్లు హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో కలిపి మొత్తం 49 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో తలపడతాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు విశాక ఈ టోర్నీలో భారీగా నగదు బహుమతులను ప్రకటించింది. ఓవరాల్ విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచే జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 3 లక్షలు అందజేస్తారు.