రూల్స్​కు విరుద్ధంగా కేయూ పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్లు

రూల్స్​కు విరుద్ధంగా కేయూ పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్లు
  • రాష్ట్ర సర్కారుకు నివేదిక అందజేసిన త్రిమెన్ కమిటీ 

హైదరాబాద్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తేలింది. ఈ మేరకు సర్కారు నియమించిన త్రిమెన్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. భవిష్యత్‌‌‌‌లో అడ్మిషన్ల విధానంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది. కేయూ పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని గత ఆరు నెలలుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అప్పట్లో పీసీసీ చీఫ్‌‌‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి వరంగల్‌‌‌‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పీహెచ్‌‌‌‌డీ అడ్మిషన్లపై ఎంక్వైరీ చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

దీంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ నేతృత్వంలో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పాండురంగా రెడ్డి, వెంకటేశ్వర్లుతో త్రిమెన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ గత నెల 17న వరంగల్‌‌‌‌లోని కాకతీయ వర్సిటీకి వెళ్లి, అడ్మిషన్ల విధానాన్ని పరిశీలించింది. ప్రొఫెసర్లు, డీన్లు, స్టూడెంట్లతో మాట్లాడి నివేదికను సిద్ధం చేసింది. తాజాగా ఈ కమిటీ తన రిపోర్టును హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సడ్మిట్ చేసింది. పీహెచ్‌‌‌‌డీ కేటగిరీ1 అడ్మిషన్లు పూర్తికాకముందే, కేటగిరీ2లో ప్రవేశాలు చేపట్టారని గుర్తించింది. స్టూడెంట్ల నుంచి వచ్చిన ప్రెషర్‌‌‌‌‌‌‌‌తోనే ఇలా చేశామని అక్కడి అధికారులు చెప్పినట్టు నివేదికలో పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియపై మానిటరింగ్ కొనసాగాలని, రీచెక్ చేసే విధానం ఉండాలని కమిటీ సూచించినట్టు తెలిసింది.