పవన్ కళ్యాణ్ నీ అంతు చూస్తా.. ద్వారంపూడి వార్నింగ్

పవన్ కళ్యాణ్ నీ అంతు చూస్తా.. ద్వారంపూడి వార్నింగ్

పవన్ కల్యాణ్.. నీకు దమ్ము దైర్యం ఉంటే కాకినాడు నుంచి పోటీ చెయ్యి.. నువ్వు ఓ పార్టీకి అధ్యక్షుడివే కదా.. మగాడివైతే కాకినాడ నుంచి పోటీ చేసి గెలువు.. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే నేను గెలిస్తే.. నువ్వు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి.. ఈ సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అంటూ సవాల్ చేశారు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. కాకినాడలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే.. చిత్తు చిత్తుగా ఓడిస్తానంటూ ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే. 

కాకినాడలో ద్వారంపూడిని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నా పవన్ కళ్యాణ్ సవాల్ ను ద్వారంపూడి చంద్రశేఖర్ స్వీకరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అంటూ ధ్వజమెత్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ ను విమర్శించే అర్హత, స్థాయి కూడా పవన్ కల్యాణ్ కు లేదంటూ చురకలు అంటించారు. రాజకీయ వ్యభిచారి పవన్ అంటూ దుమ్మెత్తిపోశారు ఎమ్మెల్యే ద్వారంపూడి. నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను.. నువ్వు రెండు చోట్ల పోటీ చేసిన ఓడిపోయావ్.. నీకు నాకు చాలా తేడా ఉందంటూ దెప్పిపొడిచారు ద్వారంపూడి. 

ప్యాకేజీ కుదరలేదనే పవన్ వారాహి యాత్ర మొదలు పెట్టారని..ఆయన ప్యాకేజీ స్టార్ అని అందరికి తెలుసని ఆరోపించారు. ఎవరిని ఉద్దరించడానికి పవన్  జనసేన పార్టీ పెట్టారో చెప్పాలన్నారు. తాను  సీఎం అయినట్లు పవన్  సినిమా తీసుకోని సంతోషపడాలన్నారు. 

పవన్ మార్చి 14న  ఓ మాట జూన్ 14న మరో మాట మాట్లాడుతారని ధ్వజమెత్తారు.  ఎవడో చెప్పిన మాటలు విని గంతులేయొద్దని పవన్ కు చురకలంటించారు.  తాను తలుచుకుంటే కాకినాడలో  బ్యానర్ కట్టనివ్వబోన్నారు.  తనకు  అవకాశం వస్తే పవన్ కు తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రం నుంచి పవన్, చంద్రబాబును తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.