ప్రారంభించిన ఏడాదికే మేడిగడ్డ సీసీ బ్లాక్​లు కొట్టుకపోయినయ్

ప్రారంభించిన ఏడాదికే మేడిగడ్డ  సీసీ బ్లాక్​లు కొట్టుకపోయినయ్

 విజిలెన్స్​ఎన్​ఫోర్స్​మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఎంక్వైరీలో వెల్లడైన విషయాలపై ప్ర జెంటేషన్ ఇచ్చారు. ‘మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించిన ఏడాదికే సీసీ బ్లాక్​లు కొట్టుకు పోయాయి. బ్యారేజీ నిర్మాణం కోసం ఏర్పా టు చేసిన కాఫర్ డ్యామ్​ను తొలగించకపోవ డం వల్ల బ్యారేజీకి భారీ నష్టం జరిగింది. 2020 మే 18, 2021 ఫిబ్రవరి 17న, 2022 ఏప్రిల్ 6న బ్యారేజీ పరిస్థితిని గమనించిన ఇరిగేషన్ ఇంజినీర్లు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. సర్కారు గానీ, ఎల్​అండ్​టీ సంస్థ గానీ రిపేర్లు చేయలేదు. దీనివల్లే బ్యారేజీ కుంగిందన్నారు. 

ఎస్ఎస్ఏ రూల్స్, డ్యామ్స్​సేఫ్టీ యాక్ట్ నిబంధనలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ పాటించలేదు’ అని ఆయన తెలిపారు. 2016 ఏప్రిల్​లో రూ.2,591 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోగా, 2021 సెప్టెంబర్ నాటికి అంచనా వ్యయాన్ని రూ.4613 కోట్లకు పెం చేశారని చెప్పారు. పనులు పూర్తిచేయకుండానే మేడిగడ్డ బ్యారేజీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో త్వరలో పూర్తి నివేదిక  అందజేస్తామని రాజీవ్​ రతన్​ తెలిపారు.