కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట,గజ్వేల్,సిరిసిల్ల కోసమేనా

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట,గజ్వేల్,సిరిసిల్ల కోసమేనా

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట-గజ్వేల్-సిరిసిల్లకు మాత్రమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ప్రాజెక్టు నిర్మిస్తే కామారెడ్డి-నిజామాబాద్ కు నీళ్లు వస్తాయి…కానీ ప్రాజెక్టు ఎందుకు కట్టడం లేదన్నారు. కాళేశ్వరం కు లైఫ్ లైన్ ఎల్లంపల్లి-మిడ్ మానేరు-లోయర్ మానేరు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినట్లు తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ ఎన్నో సార్లు లేఖలు రాశారని అయినా…ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదన్నారు షబ్బీర్ అలీ. అంతేకాదు కరోనాపై ప్రభుత్వ చర్యల పై కూడా గవర్నర్ ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదన్నారు. తాను కూడా ఇదే విషయంపై డీజీపీ,సీఎం కు ఎన్ని సార్లు లేఖలు రాసినా సమాధానం రాలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో శవాలను, కరోనా రోగులను ఒకే బెడ్ పై పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక పోలీసుల వ్యవహారం పై లీగల్ గా వెళ్తామన్నారు. సెక్షన్-8 అధికారాలను గవర్నర్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకోవాలన్నారు షబ్బీర్.