
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పంప్‌హౌస్ 3వ,4వ మోటార్లను ఆటోమోడ్‌లో వెట్ రన్ నిర్వహించారు. ఇప్పటికే ఐదు మోటార్లను మాన్యువల్ మోడ్‌లో వెట్ రన్ చేసిన ఇంజినీర్లు ఆటోమోడ్ అప్‌డేట్ కోస నాలుగు రోజులు మోటార్లను ఆపేసిన సంగతి తెలిసిందే. అగిపోయిన మోటార్ల పంపింగ్ తాజాగా ఆదివారం తెల్లవారుజాము నుంచి నడిపిస్తున్నారు. ఆస్ట్రియా నుంచి వచ్చిన ఇంజినీర్లు వాటిని అప్‌డేట్ చేసి మన రాష్ట్ర ఇంజినీర్లు మేయింటెనెన్స్‌ల చేసేలా ఏర్పాట్లు చేశారు. నీటి పంపింగ్ మొదలవగానే ఇంజినీర్లు మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసేశారు. ప్రాణహితలో ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ఈఈ రమణారెడ్డి తెలిపారు. మేడిగడ్డ వద్ద బెడ్ లెవల్ నుంచి 8.5 మీటర్ల వాటర్ లెవల్, ఏడు టీఎంసీల బ్యాక్ వాటర్ ఉన్నట్లు వివరించారు. నాలుగు రోజులుగా మేడిగడ్డ పంప్‌హౌస్ మోటార్లు ఆపేయడంతో గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీ నీరు అగిపోయింది. ఆదివారం మళ్లీ రెండు మోటార్లతో 4600 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నరు. సోమవారం సాయంత్రం ఇంకో ఒక్కటి లేదా రెండు మోటార్లను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. అన్నారం బ్యారేజ్ వద్ద బెడ్ లెవల్ నుంచి 10 మీటర్ల హైట్‌లో నీళ్లున్నయ్. బ్యాక్ వాటర్ ఇది వరకే అన్నారం బ్యారేజీకు చేరుకోవడం వల్ల అన్నారం పంస్‌హౌస్ నుంచి సుదిళ్లకు కూడా నీటిని పంప్ చేస్తున్నారు.