ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై హైకోర్టు సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలని టీజేఎస్ సెగ్మెంట్ ​ఇన్​చార్జి సర్దార్​ వినోద్​కుమార్ ​డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ముథోల్​లో పోస్టర్​ రిలీజ్​చేసి మాట్లాడారు. ఈ నెల 13న హైదరాబాద్​లో జరిగే రణదీక్షను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో గోదావరి నది తీర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబం, కాంట్రాక్టర్​మేగా కృష్ణారెడ్డికి బంగారు బాతుగా మారిందన్నారు. కార్యక్రమంలో లీడర్లు భోజన్న, గంగాధర్, సతీశ్, పుండ్లిక్, సాహెబ్​రావు, విజయ్, రామేశ్వర్, మల్లేశ్, ప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.

పొన్కల్​ను మండలం చేయాలని కుక్కకు వినతి

నిర్మల్, వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం స్థానికులు కుక్కకు వినతిపత్రం ఇచ్చి వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

శాలివాహన పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల పట్టణంలోని శాలివాహన పవర్ ప్లాంట్ లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉనుక, పామాయిల్ పొట్టు, కాలం చెల్లిన విత్తనాలు కాలి బూడిదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

బాసర ట్రిపుల్​ ఐటీ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్,వెలుగు: బాసర ట్రిపుల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ శుక్రవారం ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్​లీడర్లు ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు ఆఫీస్ ముట్టించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్​వద్ద అరెస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా.. పట్టించుకోక పోవడం దారుణమన్నారు. నిరసనలో ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు, యూత్​కాంగ్రెస్ వైస్​ ప్రెసిడెంట్​వాహెద్, సెక్రటరీ రూపేశ్​రెడ్డి, అశోక్​రెడ్డి  పాల్గొన్నారు.

దివ్యాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా నరసింహస్వామి

లోకేశ్వరం, వెలుగు: దివ్యాంగుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన నరసింహస్వామిని నియమించినట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు సుమతి, వ్యవస్థాపకుడు సమ్మయ్య తెలిపారు. శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు.

26  వేల మందికి కొత్త పెన్షన్లు

నిర్మల్,వెలుగు: జిల్లాలో  ఈ నెల15 నుంచి మరో 26  వేల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నిర్మల్​లో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సీఎం ఫ్లెక్సీ కటౌట్ లకు రాఖీలు కట్టారు. స్థానిక నాయుడువాడలో ఆంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఇప్పటికే 1.50 లక్షలకు పైగా మందికి పెన్షలు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు అర్హులైన 26,254  మందికి అదనంగా పెన్షలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంతవరకు రూ.100 కోట్లకు పైగా ఫండ్స్​ఖర్చుచేసి 500 కొత్త ఆలయాలు నిర్మించినట్లు తెలిపారు. మరోచోట నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ జీవన్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని సన్మానించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే బీజేపీ లీడర్లపై దాడులు

మంచిర్యాల,వెలుగు: ఓటమి భయంతోనే టీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి ఆరోపించారు. గురువారం రాత్రి  టీఆర్ఎస్​నాయకుల దాడిలో గాయపడ్డ తాండూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భాస్కర్ గౌడ్​ను శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రఘునాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యన్నారు. అనంతరం ఆయన మంచిర్యాల డీసీపీ ఆఫీస్​కు వెళ్లి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆయన వెంట గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీశ్​గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు జీవీ ఆనంద్, కృష్ణ రజనీష్​జైన్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు కోడి రమేశ్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్  కుమార్, రేవెల్లి విజయ్ తదితరులు ఉన్నారు.

జాతీయ విద్యావిధానం అమలు చేయొద్దు

మంచిర్యాల,వెలుగు: జాతీయ విద్యా విధానం–2020ని అమలు చేయొద్దు,  సీపీఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గొల్ల రమణ, ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) 23 వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం స్థానికంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షుడు ఎం.ఆగాచారి జెండా ఎగురవేశారు. పతాకంను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జిల్లా కార్యదర్శి జైపాల్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, శ్రీనివాస రెడ్డి, భరీకు రావు, సంపత్, దుర్గయ్య, వాహిద్ అలీ, రమేశ్​తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల అభివృద్ధి

భైంసా,వెలుగు: కాంగ్రెస్​తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్​చెప్పారు. బాసర నుంచి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కుంటాల మండలం కల్లూరు సాయిబాబా ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ... ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్​అధికారంలో ఉన్నప్పుడు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో అన్నివర్గాలు విసుగెత్తాయన్నారు. పాదయాత్ర నిర్మల్​ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఆయన కల్లూరు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో లీడర్లు గంగాధర్, ఆనంద్ రావు పటేల్, రజాఖ్, వడ్నం శ్రీనివాస్, సాయినాథ్, రవికుమార్, ఛక్రధర్​పటేల్​తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తిరంగా ర్యాలీ

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం బీజేపీ, మోర్చాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్లు జాతీయ జెండాలతో బైక్​లపై తిరిగారు. మంచిర్యాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​ వెరబెల్లి ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది.  భైంసాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సుమారు రెండువేల బైక్​ల మీద మోహన్​రావు పటేల్​ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాజీ సైనికులను సన్మానించారు. ఉరేగింపులు సుమారు 10 వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. లీడర్లు సుభాష్​పటేల్, తాడేవార్​సాయినాథ్,​ కపిల్, దిలీప్, రామకృష్ణ, కల్లూర్​సర్పంచ్​లక్ష్మణ్ పటేల్, బాసర సుభాష్​ పటేల్, పొశెట్టి హాజరయ్యారు. ఆదిలాబాద్​లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్​లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఇన్​చార్జి  వెంకటేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రావణ్, గిరిజన మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యురాలు జాను బాయి, లీడర్లు రితీశ్​ రాథోడ్, హరి రాజశేఖర్, నాయిని సంతోష్  తదితరులు ఉన్నారు.  

- వెలుగు నెట్​వర్క్


గూడెంలో ఘనంగా శ్రావణ పౌర్ణమి

దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ అన్నదాన సౌకర్యం కల్పించారు.‌‌‌‌‌‌‌‌             

-దండేపల్లి,వెలుగు