
తమిళనాడులోని కల్లాకురిచి విషాద ఘటనలో మృతుల సంఖ్య 53కి పెరిగిందని శనివారం ( జులై 22) అధికారులు తెలిపారు. కల్లాకురిచి జిల్లా కలెక్టర్ ఎం.ఎస్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్తీసారా ఘటనలో మొత్తం 193 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 140 మంది క్షేమంగా ఉన్నారు. 53 మంది చనిపోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకు .. తమిళనాడు సిఐడి శాఖకు అప్పగించింది. రోగులకు వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు. వివిధ మెడికల్ కాలేజీల నుంచి 56 మంది డాక్టర్లు రోగులకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న చాలామంది రోగులు కూడా క్రమంగా కోలుకుంటున్నారని కలెక్టర్ అన్నారు.
కల్తీసారా ఘటనపై తమిళనాడు సిఎం ఎం.కె. స్టాలిన్ సీరియస్ అయ్యారు. పలువురు అధికారులపై ఆయన బదిలీ వేటు వేశారు. అలాగే తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. కల్లారిచి దుర్ఘటనలో తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లల, విద్య, హస్టల్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై అసెంబ్లీ చర్చ జరపాలని అన్నాడిఎంకె సభ్యులు నినాదాలు చేయడంలో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
మరోవైపు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు., ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50 వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ తెలిపారు. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి. గోకుల్దాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను కూడా నియమించిందన్నారు. ఇదిలావుండగా... తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో 250 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు . తమిళనాడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ నేత ఆంటోనీ డిమాండ్ చేశారు.