మగవారు వాసేక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలి : డిప్యుటీ డీఎంహెచ్ వో ప్రదీప్ బాబు

మగవారు వాసేక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలి : డిప్యుటీ డీఎంహెచ్ వో ప్రదీప్ బాబు

కల్లూరు, వెలుగు : ఎలాంటి సైడ్​ఎఫెక్ట్​లేని, సురక్షితమైన, సులభమైన వాసేక్టమీ ఆపరేషన్ ను  మగవారు చేయించుకోవాలని కల్లూరు డివిజన్ డిప్యుటీ డీఎంహెచ్ వో ప్రదీప్ బాబు, కల్లూరు పీహెచ్​సీ నవ్య కాంత్ లంకాసాగర్,  కల్లూరు సీహెచ్​సీ సర్జన్ డాక్టర్ రమేశ్​ తెలిపారు.  తెలగవరం సబ్ సెంటర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి శుక్రవారం కల్లూరు సీహెచ్​సీ సర్జన్ రమేశ్​ కోత, కుట్టు లేని వాసేక్టమీ ఆపరేషన్ చేసి 2 గంటల్లో సురక్షితంగా చేసి ఇంటికి పంపించినట్లు తెలిపారు. 

జిల్లాలో ఎక్కడైనా మగవారు ఈ ఆపరేషన్ కోసం సిద్ధంగా వుంటే స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు చెప్పారు. కుటుంబంలో స్త్రీల మానసిక, శారీరక ఉపశమనం కోసం, సామాజిక బాధ్యతగా మగవారు ముందుకు రావాలని కోరారు.