ఖమ్మంలో దారుణం.. నీటి సంపు గోడ కూలి సచ్చిపోయిండు

 ఖమ్మంలో దారుణం.. నీటి సంపు గోడ కూలి సచ్చిపోయిండు

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నీటి సంపు గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నీటి సంపు గోడ కూలి మేక స్వామి అనే కూలీ మృతి చెందాడు. ఇటీవల కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్ గ్రేడ్ చేస్తూ 30 పడకల హాస్పిటల్ గా మారుస్తున్నారు. దీనిలో భాగంగానే గత నెల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కల్లూరుకు వచ్చి హాస్పిటల్ భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పనుల్లో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నీటి సంపు నిర్మాణం చేపట్టారు.ఈ సంపు వద్దకు అక్కడే కూలి పనులు చేస్తున్న స్వామి రాగ ఒకసారిగా గోడ కూలి అతనిపై పడింది. వెంటనే స్వామిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాసిరకంగా నీటి సంపు నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.